News August 25, 2025
నెల్లూరు జిల్లాలో 7,10,990 కుటుంబాలకు కార్డులు పంపిణీ

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. నెల్లూరు జిల్లాలో 7,10,990 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ నుంచి కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుని ఫొటో, ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది.
Similar News
News August 25, 2025
నెల్లూరు చేరుకున్న మంత్రి అనగాని

నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలెక్టర్ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బొకే అందించి స్వాగతం పలికారు. జిల్లాలో నెలకొన్న పలు రెవెన్యూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ఆయన్ను కలిశారు.
News August 25, 2025
నెల్లూరు: రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులు అరెస్ట్

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులపై జిల్లా పోలీసులు దృష్టిపెట్టారు. అతని ప్రధాన అనుచరులు జగదీశ్‌తో పాటు భూపతి, సురేంద్రను వేదయపాలెం పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాంత్ గ్యాంగ్‌పై పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టిన నేపథ్యంలో మరి కొంతమందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి.
News August 25, 2025
నెల్లూరు: మద్యం కోసం కత్తితో బావనే బెదిరించాడు

మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో సొంత బావనే కత్తితో బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. జ్యోతి నగర్‌కు చెందిన సాజిద్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో తన బావ సంధానిని అడిగాడు. అతను లేవని చెప్పడంతో కత్తితో బెదిరించి అతని వద్ద నుంచి రూ.1000 తీసుకున్నాడు. దీంతో బాధితుడు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.