News January 25, 2026

నెల్లూరు జిల్లావ్యాప్తంగా పోలీస్ హై అలర్ట్: ఎస్పీ

image

గణతంత్ర దినోత్సవం, రథసప్తమి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ దేవాలయాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా ఉంచామన్నారు.

Similar News

News February 2, 2026

KGBVల్లో ఖాళీల భర్తీ పరిస్థితి ఏంటి: వేమిరెడ్డి

image

రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వివరించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. సోమవారం లోక్ సభలో కేజీబీవీలపై ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో 587 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలకు గాను 487 మాత్రమే పని చేస్తున్నాయని, ఇది నిజమేనా అని ఆయన ఆరా తీశారు.

News February 2, 2026

నెల్లూరు: ఈ స్కూటీ దొంగ మీకు తెలుసా..?

image

చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి కొడవలూరు మండలం గండవరం గ్రామంలో 29వ తేదీన స్కూటీని దొంగలించినట్లు కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యక్తి స్కూటీని అపహరించినట్లు CC ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరికైనా తెలిస్తే వెంటనే 9440796328 ఫోన్ నెంబర్‌కి సమాచారం అందించాలని కోరారు.

News February 2, 2026

కందుకూరు: నేడు కూడా పాత రేట్ల ప్రకారమే భూముల రిజిస్ట్రేషన్

image

ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జనవరి 31 తేదీ వరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కిటకిటలాడాయి. అయితే అందుకు సంబంధించిన GO ఇంకా రాకపోవడంతో పాత రేట్ల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జీవో రావడానికి ఇంకో రెండు రోజులు సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. 31వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకోలేని వాళ్లు భలే ఛాన్సులే అని సంబరపడుతున్నారు.