News December 30, 2025

నెల్లూరు: జిల్లా పునర్వ్యవస్థీకరణపై తుది నోటిఫికేషన్ విడుదల

image

APలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చేలా నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య రెవెన్యూ డివిజన్లు–మండలాల పునర్విభజన చేపట్టారు. కొండాపురం, VKపాడును కావలి డివిజన్‌లోకి, గూడూరు, చిల్లకూరు, కోటను గూడూరు డివిజన్‌లోకి చేర్చారు. వాకాడు, చిట్టమూరు(M)ను S.పేట డివిజన్‌లోకి, బాలయపల్లి, వెంకటగిరి, డక్కిలిని శ్రీకాళహస్తి డివిజన్‌లోకి విలీనం చేశారు.

Similar News

News December 31, 2025

నెల్లూరు: సాగులో సమస్యలా.. ఈ నంబర్లకు కాల్ చేయండి

image

జిల్లాలో సాగు సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి.. ఏ మందులు వాడాలి.. సస్యరక్షణ చర్యలు ఏంటి.. ఎరువులు ఏ మొతాదులో వేయాలి.. వంటి సమస్యలకు వ్యవసాయశాఖ కొన్ని ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకోచ్చింది.
-వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు : 0861-2327803, 9490327424
-వేరుశనగ : 9440566582
-ఉద్యాన, వ్యవసాయ పంటలు(తెగుళ్లు : 0861-2349356, 9490004254
– ఉద్యానపంటలు: 7995088181 (ఉద్యాన శాఖ )

News December 31, 2025

కలెక్టర్ @100 days : సక్సెస్ మీట్

image

జిల్లాలో కలెక్టర్‌గా హిమాన్షు శుక్ల బాధ్యతలు తీసుకొని 100 రోజులు అయింది. నెల్లూరు కలెక్టరేట్ తిక్కన భవనంలో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. బాధ్యతలు చేపట్టే సమయంలో తనకు ఇండోసోల్ కంపెనీ భూసేకరణ సమస్య తీవ్రంగా ఉండిదని, 1200 ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. BPCL కు 6 వేల ఎకరాలు అవసరం కాగా.. 3 వేలు సేకరించామని, అది జిల్లా విభజనలో ఒంగోలుకు వెళ్లిందని, ఇంకా.. 3 వేలు కావలి ని.లో చేయాల్సి ఉందని తెలిపారు.

News December 31, 2025

నెల్లూరు: దోచుకుంది రూ.23 కోట్లు.. రికవరీ రూ.1 కోటి

image

జిల్లాలో 2025లో సైబర్ క్రైమ్ పెరిగింది. ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు రూ.23,57,97,426 దోచేశారు. చాలామంది ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో దోచేయగా, ఇతరత్రా విధానాల్లో పెద్ద ఎత్తున్న దోచుకున్నారు. 2025లో సైబర్ నేరగాళ్లు రూ.23.57 కోట్లు దోచుకోగా.. పోలీసులు కేవలం రూ.1.07 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఇంకా పెద్ద ఎత్తున ఈ రికవరీ సాధించాల్సి ఉన్నా ఆ దిశగా ప్రగతి కనబర్చలేదు.