News March 28, 2025

నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక 

image

ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ నగదును లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుందని జాయింట్ క‌లెక్ట‌ర్ కార్తీక్ తెలిపారు. దీపం 2 స్కీం కింద లబ్ధిదారులు సబ్సిడీ అమౌంట్ తమ ఖాతాలో జమ అయిందా లేదా అని https://epds2.ap.gov.in/lpgDeepam/epds పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ కోరారు.

Similar News

News March 31, 2025

నెల్లూరు: ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ పద్ధతి ప్రారంభం

image

ఏప్రిల్ రెండవ తేదీ నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలిపారు.

News March 30, 2025

రేపు పోలీస్ ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక రద్దు

image

ప్రతి సోమవారం జరిగే పోలీసు ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. మరల వచ్చే సోమవారం యధావిధిగా ఈ ప్రజా ఫిర్యాదు పరిష్కార కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

News March 30, 2025

64 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: జేసీ కార్తీక్

image

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 64 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ తెలిపారు. శనివారం 6,893 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జేసీ చెప్పారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు

error: Content is protected !!