News January 13, 2025
నెల్లూరు జిల్లా వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు

జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు జిల్లా వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను జిల్లా వాసుల సుఖసంతోషాలతో జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఇంట సిరి సంపదలు, భోగభాగ్యాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు.
Similar News
News January 8, 2026
నెల్లూరు రూపు రేఖలు మారేనా..?

నెల్లూరులో త్వరలో 84KM మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. NH-16, బుచ్చి హైవే, మినీబైపాస్ రోడ్డు, పొదలకూరు రోడ్డు, ముత్తుకూరు రోడ్డు తదితర ప్రాంతాలు అనుసంధానం కానున్నాయి. ట్రాఫిక్ సమస్య తీరనుంది. కృష్ణపట్నం పోర్టుతో పాటు పలు పరిశ్రమలకు భారీ వాహనాల రాకపోకలు సులభంగా జరగనున్నాయి. దూరాభారాలు తగ్గనున్నాయి. లేబూరు బిట్-2 నుంచి రాజుపాలెం వరకు రింగ్ రోడ్డు రానుండగా భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది.
News January 8, 2026
శకటాలను అందంగా తయారుచేయండి: జేసీ

నెల్లూరులో రిప్లబిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల పరిశుభ్రతతో పాటు భద్రతకు ప్రాధాన్యమివ్వాలని పోలీస్ శాఖకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా, విజ్ఞానదాయకంగా తయారుచేసి ప్రదర్శించాలని కోరారు.
News January 8, 2026
కాకాణి.. ఇప్పుడు మాట్లాడు: సోమిరెడ్డి

కండలేరు స్పిల్ వే నుంచి 500 క్యూసెక్కుల నీరు విడుదల కావడంపై సోమిరెడ్డి స్పందించారు. ‘అయ్యా.. కాకాణి గారు.. కండలేరు స్పీల్ వేపై ఇప్పుడు మాట్లాడు. గతంలో జంగిల్ క్లియరెన్స్ జరగలేదని, 100క్యూసెక్కులు కూడా ప్రవాహం ఉండదని నోరు పారేసుకున్నావు. ఇప్పుడు 500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నువ్వు వెళ్లి చూడు. జంగిల్ క్లియరెన్స్ జరిగిందా? లేదా? అనేది ఇప్పుడు చెప్పవయ్యా’ అని సోమిరెడ్డి సవాల్ చేశారు.


