News January 5, 2025

నెల్లూరు జిల్లా వైసీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన్నెమాల

image

వైసీపీ నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పిడూరుకు చెందిన మాజీ సర్పంచ్ మన్నెమాల సాయి మోహన్ రెడ్డిని నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అభివృద్ధికి మన్నెమాల ఎంతో కృషి చేసి చేశారని, గ్రామంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నాడని సన్నిహితులు తెలిపారు. దీంతో అధిష్ఠానం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి పదవినిచ్చినట్లుగా నాయకులు తెలిపారు.

Similar News

News January 7, 2025

ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్ ఆనంద్

image

ప్రతిరోజూ లక్ష పనిదినాలు లక్ష్యంగా ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాల్లో ఉపాధిహామీ, ఆర్‌డబ్ల్యుఎస్‌, హౌసింగ్‌, పంచాయతీ రాజ్‌ సీసీ రోడ్ల గ్రౌండింగ్‌, ఎంఎస్‌ఎంఈ సర్వే, ఎస్టీలకు ఆధార్‌కార్డుల జారీ, పిఎం సూర్యఘర్‌ యోజన పథకం అమలు మొదలైన అంశాలపై అధికారులతో మాట్లాడారు.

News January 6, 2025

నెల్లూరు: సంక్రాంతి ట్రైన్లు.. 8 గంటలకు బుకింగ్

image

➤ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➤ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➤ చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➤ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➤ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్లు నెల్లూరు, గూడూరు జంక్షన్లలో ఆగుతాయి. వీటికి ఇవాళ ఉదయం 8 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.

News January 6, 2025

నెల్లూరు: నకిలీ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం

image

నెల్లూరు జిల్లాలో నకిలీ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. జిల్లాలో దాదాపు మూడు లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. వాటిలో చాలా వరకు బోగస్‌వే అన్న ఆరోపణల నేపథ్యంలో ఇవాల్టి (సోమవారం) నుంచి వాటి లెక్కను ప్రభుత్వం తేల్చనుంది. పెద్దాస్పత్రిలోని డాక్టర్ల బృందం ఇంటింటికి తిరిగి లబ్ధిదారుల నుంచి వివరాలను సేకరించి ఆ నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.