News December 22, 2024
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర తనిఖీలు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా SP జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఇవాళ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వాహనాలు, లాడ్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. రాత్రి వేళల్లో లాడ్జీల్లో బస చేసిన వారి వివరాలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్ ఘటనలో 80, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 96, రోడ్డు నిబంధనలు పాటించని మరో 514 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 22, 2024
నెల్లూరు జిల్లాలో తులం బంగారం రూ.78,470
నెల్లూరు జిల్లాలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,470లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.7,100లుగా ఉంది. కాగా 24 క్యారెట్ల బంగారం ధర శనివారంతో పోల్చితే రూ.700కు పెరిగింది. గడిచిన కొద్ది రోజులుగా జిల్లాలో మేలిమి బంగారం ధరలు తులం రూ.78వేలకు పైగా ఉండగా శనివారం కాస్త తగ్గి రూ.77వేలకు చేరింది.
News December 22, 2024
నెల్లూరు: బీచ్‌లో యువకుడు మృతి
ఆయన ఉద్యోగం కోసం కొద్ది రోజుల్లో గల్ఫ్ వెళ్లాలి. సరదాగా ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వడం కోసం బీచ్‌కు వెళ్లగా.. అదే అతడి చివరి రోజుగా మారింది. SI నాగబాబు వివరాల మేరకు.. దొరవారిసత్రం(M) తనయాలికి చెందిన సతీశ్, చెంచుకృష్ణ, మునిశేఖర్ రెడ్డి స్నేహితులు. సతీశ్‌కు గల్ఫ్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో సరదాగా గడిపేందుకు తూపిలిపాలెం బీచ్‌కు వెళ్లగా.. అలల తాకిడికి సతీశ్ కొట్టుకుపోయి చనిపోయాడు.
News December 22, 2024
నెల్లూరు: వైభవంగా లక్ష్మి నరసింహ స్వామి పల్లకి సేవ
నెల్లూరు కలకొండ కొండపై గల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో స్వామివారికి శనివారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. స్వామివారు ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మి సమేతుడై పల్లకిలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహ నామ స్మరణతో దేవాలయం మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.