News September 24, 2024
నెల్లూరు జిల్లా 108లో ఉద్యోగ అవకాశాలు
నెల్లూరు జిల్లాలోని 108 వాహనాల్లో పైలెట్, ఈఎంటీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఎస్. విజయ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 25వ తేదీలోపు నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, దిశ మహిళా పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న 108 కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
Similar News
News December 22, 2024
నెల్లూరు జిల్లాలో తులం బంగారం రూ.78,470
నెల్లూరు జిల్లాలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,470లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.7,100లుగా ఉంది. కాగా 24 క్యారెట్ల బంగారం ధర శనివారంతో పోల్చితే రూ.700కు పెరిగింది. గడిచిన కొద్ది రోజులుగా జిల్లాలో మేలిమి బంగారం ధరలు తులం రూ.78వేలకు పైగా ఉండగా శనివారం కాస్త తగ్గి రూ.77వేలకు చేరింది.
News December 22, 2024
నెల్లూరు: బీచ్‌లో యువకుడు మృతి
ఆయన ఉద్యోగం కోసం కొద్ది రోజుల్లో గల్ఫ్ వెళ్లాలి. సరదాగా ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వడం కోసం బీచ్‌కు వెళ్లగా.. అదే అతడి చివరి రోజుగా మారింది. SI నాగబాబు వివరాల మేరకు.. దొరవారిసత్రం(M) తనయాలికి చెందిన సతీశ్, చెంచుకృష్ణ, మునిశేఖర్ రెడ్డి స్నేహితులు. సతీశ్‌కు గల్ఫ్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో సరదాగా గడిపేందుకు తూపిలిపాలెం బీచ్‌కు వెళ్లగా.. అలల తాకిడికి సతీశ్ కొట్టుకుపోయి చనిపోయాడు.
News December 22, 2024
నెల్లూరు: వైభవంగా లక్ష్మి నరసింహ స్వామి పల్లకి సేవ
నెల్లూరు కలకొండ కొండపై గల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో స్వామివారికి శనివారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. స్వామివారు ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మి సమేతుడై పల్లకిలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. నరసింహ నామ స్మరణతో దేవాలయం మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.