News September 24, 2025

నెల్లూరు జిల్లా DSC అభ్యర్థులకు గమనిక

image

డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో గురువారం నియామక పత్రాలు అందజేస్తామని నెల్లూరు డీఈవో బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారంతా నేటి సాయంత్రం 4 గంటలలోపు గొలగమూడి ఆశ్రమం వద్దకు రావాలని సూచించారు. ఇక్కడి నుంచి బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్తామన్నారు.

Similar News

News September 24, 2025

NLR: ఛైర్మన్‌గా పెళ్లకూరు బాధ్యతల స్వీకరణ

image

ఏపీ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్‌గా టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. చాలా ఏళ్ల నుంచి సోమిరెడ్డి అనుచరుడిగా శ్రీనివాసులు రెడ్డి కొనసాగుతున్నారు.

News September 24, 2025

బీద రవిచంద్రకు అరుదైన అవకాశం

image

నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు అరుదైన అవకాశం వచ్చింది. ఇవాళ ఉదయం శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు సభను ప్రారంభించారు. కొన్ని చర్చల తర్వాత ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఆ సమయంలో ఛైర్మన్ హోదాలో రవిచంద్ర ఆ కుర్చీలో కూర్చొని సభను నడిపించారు. సభ్యుల ప్రశ్నోత్తరాల సమయానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూశారు.

News September 24, 2025

సినిమా పైరసీలో నెల్లూరు జిల్లా యువకుడి ప్రమేయం..?

image

సినిమా పైరసీ వ్యవహారం నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. సీతారాంపురం మండలానికి చెందిన ఓ యువకుడు సినమా పైరసీ చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సీతారాంపురం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి సదరు యువకుడికి హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. సీతారాంపురం యువకుడితో పాటు మరికొందరు పాత్ర పైరసీ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది.