News October 1, 2025
నెల్లూరు: జోరందుకున్న మద్యం అమ్మకాలు

అక్టోబర్ 2 గాంధీ జయంతి.. దసరా రెండు ఒకే రోజు వచ్చాయి. దీంతో మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. దసరా పండగ అంటే మందు బాబులకు విందే. కానీ ఈసారి అది కుదరడం లేదు. దీంతో మందుబాబులు, బెల్టు షాపులు వారు ముందురోజే మద్యాన్ని భారీగా డంపు చేస్తున్నారు. రేపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 180 కి పైగా వైన్, 26కు పైగా బార్లు మూతపడనున్నాయి. మరోవైపు చికెన్ దుకాణాలు రాత్రి సమయం, వేకువజామునే అమ్మకాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
Similar News
News October 1, 2025
ఉదయగిరి: డిప్యూటీ కలెక్టర్ దంపతులకు తప్పిన ప్రమాదం

ఉదయగిరి హైవే పెద్ద చెరువుకు పోయే దారి వద్ద గేదెను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్( రేరా) నాదేళ్ల తిరుపతయ్య దంపతులకు ప్రమాదం తప్పింది. ఉదయగిరి (M) గడ్డంవారిపల్లికి చెందిన డిప్యూటీ కలెక్టర్ తన స్వగ్రామం నుంచి ఆత్మకూరులోని శుభకార్యానికి వెళుతుండగా అడ్డుగా వచ్చిన గేదెలను తప్పించబోయి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
News October 1, 2025
నెల్లూరు: నలుదిక్కులా ట్రాఫిక్ చిక్కులు

నెల్లూరు నగరాన్ని వాహనాలు చుట్టు ముట్టాయి. దసర పండుగ నేపథ్యంలో చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున చేరుకోవడం, ప్రజలు పలు అవసరాల నిమిత్తం నగరంలోకి రావడంతో ఆత్మకూరు బస్టాండ్, ఫ్లైఓవర్, స్టోన్ హౌస్ పేట, మినిబైపాస్, రైల్వే స్టేషన్ రోడ్లలో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి. ఎటుచుసిన వాహనాలు కదలక పోవడంతో వాహనదారులు నరకం అనుభవించారు. ఇదేమి నరకం రా బాబూ అంటూ.. జనం విసుగెత్తి పోయారు.
News October 1, 2025
నెల్లూరు జిల్లా 2వ స్థానం

జిల్లా లో 2025 – 26 సం.కు గాను ఇన్‌స్పైర్ – మనక్ నామినేషన్లు విశేష స్పందన లభించినట్లు జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలో నిలువగా నెల్లూరు జిల్లా రెండో స్థానంలో నిలిచినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 711 పాఠశాలలు నుంచి 2925 నామినేషన్లు అందినట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లాలో 3 వేలు నామినేషన్ రాగా, నెల్లూరు జిల్లా 2925 నామినేషన్లు వచ్చాయన్నారు.