News December 30, 2024

నెల్లూరు: ‘తస్మాత్ జాగ్రత్త.. ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేస్తారు’

image

నెల్లూరు పోలీస్ గ్రౌండ్‌లో సోమవారం నుంచి నిర్వహించనున్న APSLRB పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే వారిని నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతే ప్రమాణికంగా ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్‌కు వచ్చే అభ్యర్థులు సూచించిన ధ్రువపత్రాలను తమ వెంట తీసుకురావాలని ఎస్పీ కోరారు.

Similar News

News January 1, 2025

కావలిలో మహిళ దారుణ హత్య

image

కావలి గాయత్రీ నగర్‌లోని ఓ ఇంట్లో అర్పిత బిస్వాస్ (24) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికులు వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన మహిళ ఏడాది క్రితం నుంచి కావలిలో ఓ క్లినిక్ నడుపుతోంది. అక్కడే పనిచేసే యువకుడు హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న కావలి ఒకటో పట్టణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 1, 2025

నెల్లూరు కార్పొరేషన్‌లో బదిలీలు

image

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ సూర్యతేజ ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ విభాగం సూపరింటెండెంట్ సిద్ధిక్‌ను మేయర్ పేషీకి, ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యంను హౌసింగ్ ఇన్‌ఛార్జిగా, లీగల్ సెల్ సూపరింటెండెంట్ ప్రవీణ్‌ను ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగానికి బదిలీ చేశారు.

News January 1, 2025

నెల్లూరు: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు

image

వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ కోసం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నోటిఫికేషన్ జారీ చేశారు. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి కందుకూరు, ఆత్మకూరు, రాపూరు ఆస్పత్రుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉంది. జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.