News July 31, 2024
నెల్లూరు: తహశీల్దార్ల బదిలీకి రంగం సిద్ధం

జిల్లాలో తహశీల్దార్ల బదిలీకి రంగం సిద్ధమైంది. అనుకూలమైన మండలాల్లో పోస్టింగ్ కోసం పలువురు తహసీల్దార్లు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ సిఫార్సులను జిల్లా ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆ జాబితాలను పరిశీలిస్తున్న అధికారులు ఈ రోజు లేదా రేపు బదిలీ ఉత్తర్వులను జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
Similar News
News October 30, 2025
సోమశిలకు పెరుగుతున్న వరద

సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 4 నుంచి 8 క్రస్ట్ గేట్లు ఎత్తి 77,650 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి 78,460 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే మొత్తంలో కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 72 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. వరద పెరుగుతుండటంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.
News October 30, 2025
నెల్లూరు జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాసులు

నెల్లూరు జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాసులు గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో ఖజానా విభాగం కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఖజానా సిబ్బంది అందరి సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు. సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
News October 30, 2025
నెల్లూరు: ఒక్కో హెక్టార్‌కు రూ.25వేల పరిహారం

తుపాను ధాటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 42 హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం వాటిల్లిందని ఆ శాఖ జిల్లా అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. దెబ్బతిన్న కూరగాయలు, బొప్పాయి పంటలకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో పరిశీలించి ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.


