News January 17, 2026

నెల్లూరు: తీరం దాటిన సరదా.. అన్నాచెల్లెలు మృతి

image

కనుమ సంబరం కాస్తా కన్నీటి సంద్రమైంది. పండగ పూట కొత్త బట్టలు వేసుకుని, బంధువుల ఇళ్లలో సందడి చేయాల్సిన ఆ పసి ప్రాణాలు సముద్రపు అలల ఉధృతికి బలయ్యాయి. నెల్లూరు జిల్లా ​అల్లూరు మండలం ఇసుకపల్లి తీరంలో జరిగిన ఈ విషాదం కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, మనందరికీ ఒక హెచ్చరిక. ఒకే ఇంట్లో ఇద్దరు బిడ్డలు (అమ్ములు, బాలకృష్ణ) ప్రాణాలు కోల్పోవడం ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

Similar News

News February 21, 2026

నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది రవి జోసెఫ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News February 21, 2026

నెల్లూరులో 20వేల మంది ఎదురుచూపులు..!

image

నెల్లూరు జిల్లాలో 29లక్షల మంది జనాభాలో 30,5640 మంది పెన్షనర్లు. వీరికి నెలకు రూ.127 కోట్లు పంపిణీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. కనీసం ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారనే లెక్కలూ సేకరించలేదు. వితంతు పెన్షన్లూ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సదరం సర్టిఫికెట్స్ ఉన్నవారితో పాటు అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం జిల్లాలో 20వేల మంది ఎదురు చూస్తున్నారు.