News September 28, 2024
నెల్లూరు: ‘తూకాలు తక్కువగా తూస్తే చర్యలు’

వ్యాపారులు కాటాల్లో తేడాలు చేసి తక్కువగా తూస్తే కఠిన చర్యలు తప్పవని తూనికల కొలతల శాఖ జిల్లా డిప్యూటీ కంట్రోలర్ కే ఐసాక్ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్‌లో ఆయన తనిఖీలు చేశారు. పలు దుకాణాల కాటాలను పరిశీలించారు. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా కాటాలను రెన్యువల్ చేయించుకోవాలన్నారు.
Similar News
News February 27, 2026
నెల్లూరు: ఈ నంబర్లతో అమ్మాయిలకు రక్ష.!

మహిళల భద్రత కోసం రూపొందించిన ‘శక్తి’ యాప్‌పై నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బస్టాండ్లు, కళాశాలల్లో మహిళలు, విద్యార్థినులకు ఈ యాప్ డౌన్లోడ్ విధానం, ఆపద సమయంలో పోలీసుల తక్షణ సాయం పొందే తీరును వివరిస్తున్నారు. దీనితో పాటు డయల్ 100, 112, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్లపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
News February 27, 2026
ఫొక్సో కేసులపై నెల్లూరు SP కీలక ఆదేశాలు

ఫొక్సో కేసులలో అభియోగ పత్రాల దాఖలు వేగవంతం చేయాలని ఎస్పీ డా.అజిత వేజెండ్ల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సైబర్ ఫ్రాడ్ కేసులలో హోల్డ్ మనీ రికవరీ వేగవంతం కావాలన్నారు. అందుకు సంబందించి అధికారులకు అవగహన కల్పించారు.
News February 27, 2026
చెవులు మూసుకుని నెల్లూరు MLC నిరసన

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై చర్చించాలని శాసనమండలిలో వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వారంతా మండలిలో కింద కూర్చొని ఆందోళన చేశారు. నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెవులు మూసుకుని, ఇతర MLCలు కళ్లు, నోరు మూసుకుని తమ నిరసన తెలిపారు.


