News January 6, 2026

నెల్లూరు: తెల్లవారుజామున రైలు కింద పడి సూసైడ్

image

మనుబోలు- గూడూరు రైల్వే స్టేషన్ మధ్య చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో మూడో రైల్వే లైన్‌పై మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వయస్సు 45-50 ఉంటుందని రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు. మృతుడు పచ్చ రంగు ఫుల్ హాండ్స్ షర్టు బులుగు రంగు గళ్ల లుంగి ధరించి ఉన్నాడు. కుడి చేతికి ఎర్రని దారం కట్టుకొని ఉన్నాడు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 14, 2026

నెల్లూరు: రైలు కిందపడి ఒకరి మృతి

image

నెల్లూరు రైల్వే స్టేషన్లో తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి నాలుగో నెంబర్ ప్లాట్ ఫామ్ నుంచి మూడో నెంబర్‌కు వెళుతుండగా అకస్మాత్తుగా రైలు కదలడంతో రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడి వయస్సు 40-45 ఏళ్లు ఉంటుంది. ఎరుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని ఎస్సై తెలిపారు.

News February 13, 2026

మన నెల్లూరు కలెక్టర్ లవ్ స్టోరీ తెలుసా..?

image

మన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ముస్సోరీలో శిక్షణలో ఉండగా 2013లో కృతికా(పల్నాడు కలెక్టర్) పరిచయమయ్యారు. ప్రాంతాలు వేరైనా ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో పరస్పరం ఇష్టపడ్డారు. తమ కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూనే ముందుకు సాగారు. తల్లిదండ్రులను ఒప్పించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి రియాన్ష్(8), పాప అహిల్యా(18 నెలలు) ఉన్నారు. లవర్స్ డే నేపథ్యంలో తమ ప్రేమ బంధాన్ని ఆయన Way2Newsకు వివరించారు.

News February 13, 2026

కాకాణి కుమార్తెకు నోటీసులు

image

కోవూరు మండలంలో ఇటీవల మైనర్ బాలిక మృతి దుమారం రేపింది. ఈక్రమంలో ఆమె మృతిపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 16వ తేదీ విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. బాలిక మృతి మీద ఆమె దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని రావాలని కోరారు.