News September 8, 2025

నెల్లూరు: దరఖాస్తులకు ఈనెల 15 చివరి తేదీ

image

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీ చివరి గడువని జిల్లా సైన్స్ అధికారి N. శివారెడ్డి తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ పాఠశాల తరుఫున వారి వినూత్న ఆలోచనలను ప్రాజెక్ట్ రూపంలో ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ.10వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తారన్నారు.

Similar News

News September 9, 2025

ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం

image

మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ నెల్లూరు పర్యటన సమయంలో ఆయనతో పాటు 17 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ప్రసన్నను అరెస్ట్ చేయొద్దని సోమవారం సాయంత్రం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

News September 9, 2025

ఉలవపాడు: హైవేపై ప్రమాదం.. ఒకరి మృతి

image

ఉలవపాడు(M) వీరేపల్లి STకాలనీకి చెందిన యాకసిరి చెంచయ్య(40) సోమవారం రాత్రి హైవే పై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. వీరేపల్లి జంక్షన్ వద్ద బైక్‌పై ఊర్లోకి వెళుతున్న చెంచయ్యను నెల్లూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచయ్యను హుటాహుటిన ఉలవపాడు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News September 8, 2025

నెల్లూరు : నవ వధువు ఆత్మహత్య

image

వివాహమై ఏడాది తిరగకుండానే యువతి చనిపోయిన ఘటన ఇది. మృతురాలి తండ్రి వివరాల మేరకు.. నెల్లూరులోని గాంధీసంఘం గిరిజన కాలనీకి చెందిన ప్రశాంతి(25)కి చిట్వేల్(M) నేతివారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన రాజేశ్‌తో 9 నెలల కిందట పెళ్లి జరిగింది. రాజేశ్ తన స్వగ్రామంలోనే కాపురం పెట్టారు. ఇటీవల వీరి మధ్య కలహాలు వచ్చాయి. దీంతో ప్రశాంతి ఇంట్లోనే ఉరేసుకుంది. ఆమె తండ్రి దాసరి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.