News April 8, 2025
నెల్లూరు: దొంగలు వస్తారు.. జాగ్రత్త!

నెల్లూరు జిల్లాలో ఇటీవల దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. పడుగుపాడు పంచాయతీలో మధుసూదనరావు, దయాకర్ ఇళ్లకు తాళాలు వేసి HYD వెళ్లగా ఆదివారం రాత్రి నగదు, బంగారం దోచుకెళ్లారు. కోవూరు శాంతినగర్‌కు చెందిన సురేశ్ రెడ్డి ఇంట్లో నిద్రిస్తుండగానే రూ.20వేలు చోరీ చేశారు. సెలవులకు వెళ్లే వాళ్లు, రాత్రిపూట ఇంటి బయట నిద్రించే వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. LHMS సేవలు వాడుకోవాలని కోరుతున్నారు.
Similar News
News April 17, 2025
నెల్లూరులో నేడే జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం

జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం గురువారం 11 గంటలకు నెల్లూరు కలెక్టర్ ఓ.ఆనంద్ అధ్యక్షతన జరగనున్నట్లు జల వనరుల శాఖ ఇంజినీర్ డాక్టర్ దేశి నాయక్ తెలిపారు. బోర్డు సభ్యులు, సంబంధిత అధికారులు ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాని కోరారు. నెల్లూరులోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ మీటింగ్ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.
News April 17, 2025
నెల్లూరులో వ్యక్తి దారుణ హత్య

నెల్లూరు టు టౌన్ పరిధిలో సుల్తాన్(40) దారుణ హత్యకు గురయ్యారు. జాకీర్ హుస్సేన్ నగర్, పెన్నా శివారు ప్రాంతంలో బుధవారం రాత్రి దుండగులు ఆయన తల పగలగొట్టి హత్యచేసినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నవాబుపేట సీఐ అన్వర్ బాషా సిబ్బంది పరిసరాలను పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 16, 2025
41 రైతు సంఘాలకు డ్రోన్ల పంపిణీ: జేసీ కార్తీక్

వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని నెల్లూరు జేసీ కార్తీక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం పొందేందుకు శాస్త్ర సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. జిల్లాలో 41 రైతు సంఘాలకు డ్రోన్స్ ఇస్తున్నట్లు కార్తీక్ పేర్కొన్నారు.