News March 7, 2025
నెల్లూరు: ‘ధాన్యంలో నెమ్ము శాతం తేల్చాలి ‘

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యంలోని నెమ్ము శాతం, తరుగుపై రైతులకు ఒక స్పష్టత ఇవ్వాలని తెలుగుదేశం రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణమ నాయుడు కోరారు. ఈ మేరకు రైతులతో కలిసి ఆయన జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం రైతులు, మిల్లర్లతో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారని నాయుడు తెలిపారు.
Similar News
News April 22, 2025
పరారీలోనే కాకాణి..దక్కని రిలీఫ్

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ దక్కకపోవడంతో అజ్ఞాత వాసం కొనసాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇచ్చేందుకు సోమవారం హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటీషన్ విచారణ పరిధిని తేల్చే అంశాన్ని ధర్మాసనం ముందుపెట్టింది. మరోవైపు కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు వివిధ రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి.
News April 22, 2025
నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు: నెల్లూరు కలెక్టర్

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూసమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
News April 21, 2025
చట్టపరంగా న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశించారు. బాధితుల అర్జీలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.