News February 12, 2026
నెల్లూరు: నకిలీ డాక్టర్ అరెస్ట్

వైద్యం పేరుతో నమ్మించి మహిళను మత్తులోకి దించి నగలు దోచుకున్న నకిలీ డాక్టర్‌ను అలిపిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన దేవళ్ల సాయి కృష్ణ (29) జయమ్మ అనే మహిళకు వైద్యం చేస్తానని రూ.1.45 లక్షలు వసూలు చేసి, ఆమె బంధువు మౌనికకు మత్తు మాత్రలు ఇచ్చి 30 గ్రాముల బంగారు గొలుసు అపహరించాడు. నిందితుడు గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు అలిపిరి ఎస్ఐ శ్రీవాణి తెలిపారు.
Similar News
News February 17, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం

వింజమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్ పేట మండలం రాజవోలు గ్రామానికి చెందిన కూరపాటి సురేంద్ర (27) మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మెడికల్ షాపులో పనిచేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే సురేంద్ర మరణవార్త విని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి రెండేళ్ల క్రితమే వివాహం జరగగా, ఏడాది వయసున్న పాప ఉంది.
News February 17, 2026
నెల్లూరు మేయర్ పదవీపై గరం గరం..!

నెల్లూరు నగర మేయర్ పదవి ఎంపిక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మేయర్ స్రవంతికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారమే సీటు భర్తీ చేయాలని ఆమె భర్త ఆధ్వర్యంలో గిరిజన నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగుతుండగా, ఎన్నిక ఆలస్యంపై స్రవంతి వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. మాజీ మేయర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.