News April 25, 2024
నెల్లూరు నగరంలో యువకుడి దారుణహత్య

నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన రామయ్య కుమారుడు దశరథ తాతతో కలిసి పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని ఉందని ఇంట్లో నుంచి వెళ్లిన దశరథ తిరిగి రాలేదు. మంగళవారం ఆటోనగర్‌లో దశరథ మృతదేహం వెలుగుజూసింది. కత్తులతో తీవ్రంగా దాడిచేయడంతో దశరథ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 22, 2025
కొడవలూరు రైలు కింద పడిన గుర్తుతెలియని వ్యక్తి

తలమంచి – కొడవలూరు రైల్వే స్టేషన్ మూడవ లైన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతుని వయసు సుమారు 42-45 ఉంటుందని, పింక్ పసుపు రంగు చొక్కా, సిమెంట్ రంగు లుంగీ ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ రమాదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
News April 22, 2025
నెల్లూరులో ఇద్దరి ఆత్మహత్య

నెల్లూరు జిల్లాలో సోమవారం వివిధ కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని న్యూ ఎల్బీ కాలనీలో మేస్త్రీ వెంకటేశ్ (42) అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విడవలూరులోని గొళ్లపాళేనికి చెందిన నాగార్జున స్థానిక బీజేపీ కార్యాలయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
News April 22, 2025
నెల్లూరు: నూతన డీఐఈవోగా ఓ సుబ్బారావు నియామకం

నెల్లూరు జిల్లా నూతన డీఐఈవోగా ఓ సుబ్బారావు నియమితులయ్యారు. ఇక్కడ ఉన్న అధికారి డాక్టర్ ఆదూరు శ్రీనివాసులును చిత్తూరు జిల్లా డీఐఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి పనిచేస్తున్న మధుబాబును ఇనమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.