News September 23, 2025

నెల్లూరు: ‘నమ్మకంగా ఉంటూ నగదు కొట్టేశాడు’

image

నెల్లూరు బాలాజీ నగర్ పరిధిలోని కలికి కోదండరామిరెడ్డి అనే వ్యాపారవేత్త వద్ద నమ్మకంగా ఉంటూ డబ్బుకొట్టేసిన డ్రైవర్ మహేశ్ నాయక్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.2 కోట్ల 10 లక్షలు దొంగలించగా అతనివద్ద నుంచి రూ.కోటి 96 లక్షల 29వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారు, అతనికి సహకరించినవారివద్ద నుంచి 10 లక్షల నగదుతోపాటు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు నగర DSP సింధుప్రియ తెలిపారు.

Similar News

News September 23, 2025

112కు కాల్.. ప్రాణాలు కాపాడిన కోవూరు పోలీసులు

image

112 కి వచ్చిన ఫోన్ కాల్‌కి స్పందించిన కోవూరు పోలీసులు సోమవారం ఒకరి ప్రాణాలను కాపాడారు. కోవూరు మండలం వేగూరు గ్రామానికి చెందిన కందల వంశీ (26) మానసిక స్థితి సరిగా లేక తను చనిపోతున్నానని, అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోమని తన అక్క స్వరూపకు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని స్వూరూప 112కు తెలియజేశారు. వెంటనే స్పందించిన కోవూరు సీఐ వి.సుధాకర రెడ్డి రైలు పట్టాలపై ఉన్న వంశీని కాపాడారు.

News September 23, 2025

నెల్లూరు: రెండు డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం

image

నెల్లూరు విజయ డెయిరీలో రెండు మహిళా డైరెక్టర్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు ఆ రెండు పదవులకు ఇద్దరు మహిళలు మాత్రమే నామినేషన్ దాఖాలు చేశారు. దీంతో ఆ రెండు పదవులు ఏకగ్రీవమాయ్యాయి. వీటిల్లో కొడవలూరు మండలం రేగడిచెలికకు చెందిన గుర్రం నాగేశ్వరమ్మ, బాలాయపల్లి మండలం వెంగమాబాపురం పాల సొసైటీకి చెందిన సాయి నిరోషా ఏకగ్రీవమయ్యారు. అయితే ఎన్నికల అధికారి వీరి పదవులను అధికారికంగా ప్రకటించనున్నారు.

News September 23, 2025

నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో విరిగిన కుర్చీలు..

image

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కనీస వసతులు కూడా ఉండడం లేదు. రోగులు, వారి అటెండర్లు కూర్చునేందుకు కుర్చీలు సైతం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులు కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు విరిగిపోయి, నిరుపయోగంగా ఉన్నాయి. ఆసుపత్రి ఓపీ బ్లాక్‌లో నడిచే మార్గంలో ఉన్న చాలా కుర్చీలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. విరిగిన కుర్చీలకు మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.