News February 19, 2025
నెల్లూరు: నష్టపరిహారం ఇవ్వాలని వినతి

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నేత మిడతల రమేశ్ కోరారు. ఈ మేరకు నెల్లూరు ఆర్డీవో కార్యాలయ డీఏవో అనిల్‌కు వినతిపత్రం అందజేశారు. దుగ్గుంట, వావింటపర్తి, అంకుపల్లి పంచాయతీలో రైల్వే లైన్ రాళ్లు నాటి నాలుగేళ్లు దాటిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News February 20, 2025
నెల్లూరు చేరుకున్న రెవెన్యూ శాఖ కార్యదర్శి

రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాం ప్రసాద్ సిసోడియా గురువారం సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, కావలి, ఆత్మకూరు RDOలు స్వాగతం పలికారు. రేపు రెవెన్యూ అధికారులతో సిసోడియా సమావేశ మవుతారని జిల్లా సమాచార శాఖ అధికారి సదారావు ఒక ప్రకటనలో తెలిపారు.
News February 20, 2025
సోమశిల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేత

సోమశిల ప్రాజెక్టు నుంచి గత 2 రోజులుగా 6 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగింది. అయితే, పెరిగిన నీటి ప్రవాహం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించిన అధికారులు ఇవాళ ఉదయం 6 క్రస్ట్ గేట్లను మూసివేశారు. దీంతో నీటి విడుదల పూర్తిగా నిలిపివేయబడింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ, భవిష్యత్ చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు.
News February 20, 2025
నెల్లూరు: బాలికకు ప్రేమపేరుతో బెదిరింపు.. ఐదేళ్లు జైలు శిక్ష

దామరమడుగు పల్లిపాలెం గ్రామానికి చెందిన పొట్లూరి ప్రసాద్‌కు పోక్సో కేసులో ఐదేళ్లు జైలు శిక్ష రూ.37 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. మే 20, 2021న పల్లిపాలెంకు చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతూ ప్రేమించకపోతే.. తన పేరు రాసి చనిపోతానని బెదిరించాడు. ముద్దాయిలకు శిక్ష పడేలా చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ జీ కృష్ణకాంత్ అభినందించారు.