News January 19, 2026
నెల్లూరు: నేడు పాఠశాలలు ప్రారంభం

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జిల్లావ్యాప్తంగా నేడు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులతో స్కూల్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఉపాధ్యాయులు హాజరై తరగతులు నిర్వహించారు. సెలవుల తరువాత మళ్లీ చదువుల వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో ఉత్సాహం కనిపించింది. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపుతూ హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 21, 2026
నెల్లూరు : రీల్స్ చూస్తున్నారా జాగ్రత్త…

ఈ బిజీ లైఫ్‌లో సెల్‌ఫోన్ ఒక భాగమైంది. సెల్‌ఫోన్‌లో గంటల తరబడి రీల్స్ చూడటం వ్యసనంగా మారుతుంది. రీల్స్ చూడటం వల్ల సామాజిక మాధ్యమాలలో పరిచయాలు జీవిత లక్ష్యాలను పెడదోవ పట్టిస్తున్నాయి. రీల్స్ వల్ల విద్యార్థులు చదువును పక్కనపెట్టి ప్రేమ వ్యవహారాలకు ఆకర్షితులై అదృశ్యమైన వారి సంఖ్య ఎక్కువవుతోంది. తల్లిదండ్రులు విద్యార్థులపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News February 21, 2026
కావలి: రైలు కింద పడి వ్యక్తి మృతి

బిట్రగుంట – అల్లూరు రోడ్డు మధ్యలో శుక్రవారం రాత్రి సుమారు 50-55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు బూడిద రంగు అర చేతుల చొక్క, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసినవారు కావలి GRP పోలీసులను సమాచారం అందించాలని కోరారు.
News February 21, 2026
నెల్లూరు: ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్(26)కు కర్నూలు(D) పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్‌లో భాగస్వాములు కావాలని ఆ దంపతులకు చెప్పాడు. పత్తికొండకు వెళ్లి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆమెపైనే కన్నేసిన తనతో రావాలంటూ వేధించగా నిరాకరించింది. దీంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.


