News January 22, 2026

నెల్లూరు: పర్మిషన్ల కోసం వెయింటింగ్..!

image

నెల్లూరు జిల్లాలో అటవీ అనుమతులు రాక హైవే పనులు ఆగిపోయాయి. నెల్లూరు-చిలకలూరిపేట హైవే స్టేజ్-1 కింద 10.37 హెక్టార్లకు 2003 నుంచి ప్రయత్నిస్తే గతేడాది పర్మిషన్ వచ్చింది. స్టేజ్-2 అనుమతులకు ఈనెల 13న కేంద్రానికి ఫారెస్ట్ శాఖ ప్రతిపాదన పంపింది. నెల్లూరు-బద్వేల్ NH-65కి గతేడాదిలో ప్రతిపాదనలు పంపినా రాలేదు. అటవీ శాఖకు హైవే సంస్థ రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉండటంతోనే పర్మిషన్లు ఆలస్యమవుతున్నాయి.

Similar News

News February 11, 2026

నెల్లూరు: ఈ నంబర్ల నుంచి కాల్ వస్తే జాగ్రత్త..!

image

సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. మనుబోలు బీసీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి లోను తీసుకుని చెల్లించారు. అయినప్పటికీ తాను లాయర్ అంటూ 9844619074 నంబర్ నుంచి ఫోన్ చేశారు. బజాజ్ ఫైనాన్షియల్‌లో నగదు కట్టలేదని.. పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తామని బెదిరించారు. 8884380341 నంబర్ నుంచి మరొకరు ఫోన్ చేసి తాను కానిస్టేబుల్ అని కేస్ కట్టామని బెదిరించాడు. పోలీసులు విచారణ చేయగా ఫేక్ అని తేలింది.

News February 11, 2026

సాగర మిత్రల సేవలు కొనసాగించండి: వేమిరెడ్డి

image

నెల్లూరు జిల్లాలో మత్స్యశాఖ కింద పని చేస్తున్న సాగర్ మిత్రల సేవలను కొనసాగించాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయన కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సాగర్ మిత్రులు గ్రామాలలో ఎన్నో సేవలు అందిస్తున్నారని, వారి సేవలను మరింత కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

News February 11, 2026

రేపే నెల్లూరు జిల్లాకు షర్మిల రాక

image

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన ఖారారైంది. ఆమె ​ఈనెల 12న ఉదయం 10 గంటలకు మనుబోలు మండలం అక్కంపేటలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు కావలిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన వివరాలను డీసీసీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.