News August 23, 2024
నెల్లూరు: పల్లె ప్రగతికి రూ.34.68 కోట్లు

జిల్లాలోని పంచాయతీలకు రూ.34.68 కోట్ల ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. 2023-24 సంవత్సరానికి రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ట్రేడ్ గ్రాంట్‌గా రూ.20,81,17,976లు, అన్ ట్రేడ్ కింద రూ.13,87,45,162లు.. మొత్తంగా రూ.34,68,63,138 విడుదలయ్యాయి. ఈ నిధుల ద్వారా పంచాయతీల్లో కనీస వసతులు మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
Similar News
News February 18, 2026
నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.

News February 17, 2026
NGOS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కిరణ్ కుమార్

నెల్లూరు: ఏపీ NGOS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయనను నెల్లూరులోని ఎన్జీవో హోంలో జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వరంలో మంగళవారం సత్కరించారు. ట్రెజరీ అసోసియేషన్ నాయకుడు రమణారెడ్డి, ఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సభ్యులు నంది మండలం ఆంజనేయ వర్మ, లక్కాకుల పెంచలయ్య, గాదిరాజు రామకృష్ణ, రాజేంద్ర సురేష్, డీఈవో రాజేంద్ర, సతీశ్ పాల్గొన్నారు.