News February 3, 2026

నెల్లూరు: పసికందును వదిలి వెళ్లిపోయారు

image

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 3 నెలల క్రితం మగబిడ్డను వదిలి వెళ్లారు. బరువు తక్కువగా ఉన్న మగ శిశువును చిన్నపిల్లల వైద్యులే అన్నితామై సంరక్షించారు. వదిలి వెళ్లినవారు రాకపోవడంతో వారిని గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంచార జీవనం గడుపుతున్న రేణుక గతేడాది అక్టోబర్‌లో అల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కాగా శిశువు బరువు తక్కువగా ఉందని తన భర్తతో వచ్చి ఆసుపత్రిలో చేరారని తెలిపారు.

Similar News

News February 21, 2026

నెల్లూరు: ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

image

ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్(26)కు కర్నూలు(D) పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్‌లో భాగస్వాములు కావాలని ఆ దంపతులకు చెప్పాడు. పత్తికొండకు వెళ్లి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆమెపైనే కన్నేసిన తనతో రావాలంటూ వేధించగా నిరాకరించింది. దీంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 21, 2026

రోడ్డు ప్రమాదంలో నెల్లూరు యువకుడి దుర్మరణం

image

తిరుపతి జిల్లా చంద్రగిరి ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. ఒక గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని నెల్లూరు పొదలకూరు రోడ్డు నేతాజీనగర్‌కు చెందిన రోషన్ కుమార్ (25)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News February 21, 2026

నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది రవి జోసెఫ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.