News January 26, 2025

నెల్లూరు: పెళ్లికి ఒప్పుకోలేదని హత్య

image

నెల్లూరు నగరంలోని నవాబుపేట శ్రీనివాస్ నగర్‌లో నిన్న దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. మహబూబ్ బాషా కుమార్తె, షాహిద్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం వారికి నిశ్చితార్థం చేశారు. ప్రస్తుతం షాహిద్ జులాయిగా తిరుగుతున్నాడని పెళ్లికి మహబూబ్ బాషా అంగీకరించలేదు. దీనిని మనసులో పెట్టుకున్న షాహిద్ యువతి తండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడు. తర్వాత పారిపోయాడు. 

Similar News

News January 26, 2025

నెల్లూరు: 3 రంగుల పతాకం ఆకారంలో చిన్నారులు

image

నెల్లూరు జిల్లా చేజర్లలోని లుంబిని విద్యాలయంలో ఆదివారం జాతీయ జెండా ఆకారంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు కూర్చున్నారు. కాగా ఈ జెండా ఆకారం పలువురిని ఆకట్టుకుంది. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవం గూర్చి ఉపాధ్యాయులు విద్యార్థులకు గొప్పగా వివరించారు.

News January 26, 2025

చేజర్ల: 3 రంగుల పతాకం ఆకారంలో చిన్నారులు

image

చేజర్లలోని లుంబిని విద్యాలయంలో ఆదివారం జాతీయ జెండా ఆకారంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు కూర్చున్నారు. కాగా ఈ జెండా ఆకారం పలువురిని ఆకట్టుకుంది. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవం గూర్చి ఉపాధ్యాయులు విద్యార్థులకు గొప్పగా వివరించారు.

News January 26, 2025

ఆ ఆడియో నాది కాదు: నెల్లూరు జైలు సూపరింటెండెంట్‌

image

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌ శ్రీరామరాజారావుపై సోషల్ మీడియాలో ఆడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  రాజారావు స్పందించారు. ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ఛానెల్స్‌లో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. జైల్లో కొంతమంది ఖైదీలు ప్రవర్తన సరిగా లేకపోవడంతో రాజమండ్రికి తరలించామని, వారిలో కొందరు విడుదలై తనపై కక్ష కట్టారన్నారు.