News March 10, 2025

నెల్లూరు: పెళ్లి మండపంలో క్రికెట్ మ్యాచ్ లైవ్

image

పెళ్లి వేడుకల్లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రామలింగాపురంలోని ఓ కళ్యాణ మండపంలో వధూవరులు వినూత్నంగా అతిథుల కోసం ఇండియా న్యూజీలాండ్ క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు పెళ్లి వేడుకల్లోనే మ్యాచ్‌ను వీక్షించారు. వధూవరులు క్రికెట్‌పై తమ ప్రేమను ఇలా చాటుకున్నారని పలువురు ప్రశంసించారు.

Similar News

News March 10, 2025

కందుకూరు ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు?

image

కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహారం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రామాయపట్నం పోర్టు నిర్మాణంలో జోక్యం చేసుకుంటున్న ఆయన వాటా కోసం డిమాండ్ చేసినట్లు ఆంధ్రజ్యోతి సంచలన <>కథనం<<>> ప్రచురించింది. దీనికి ఆ సంస్థ ససేమేరా అనడంతో పోర్టు పనులకు కంకర, ఇసుక తీసుకెళ్తున్న లారీలను అడ్డుకుంటున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారం సీఎంవోకు చేరడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

News March 10, 2025

‘బీద’ ఫ్యామిలీ ‘డబుల్’ ఆఫర్

image

నెల్లూరు జిల్లాలో ‘బీద’ కుటుంబానికి MLC పదవి వరించింది. టీడీపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌కు బీసీ కేటగిరిలో సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇప్పటికే ఆ కుటుంబంలోని బీద మస్తాన్ రావు వైసీపీ నుంచి టీడీపీలోకి రాగానే రాజ్యసభ సీటు ఇవ్వగా, ఆయన సోదరుడు బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

News March 10, 2025

పొదలకూరు నిమ్మ యార్డుకు మంగళవారం సెలవు

image

హోలీ పర్వదినం సందర్భంగా పొదలకూరులోని ప్రభుత్వ నిమ్మ యార్డుకు మంగళవారం సెలవును ప్రకటిస్తూ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారని, ఇందులో భాగంగా వ్యాపార లావాదేవీలకు సుముఖత చూపించరన్నారు. ఇందుకోసం యార్డ్‌కు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని యార్డ్ పరిధిలోని పరిసర ప్రాంతాల నిమ్మ రైతులు గమనించాలని కోరారు.

error: Content is protected !!