News February 3, 2025
నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 95 ఫిర్యాదులు

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 95 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News March 2, 2026
నెల్లూరు: నేటి నుంచి ఓపెన్ పరీక్షలు

నెల్లూరు జిల్లాలో నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు డీఈవో ఆర్.బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు, 10వ తరగతి విద్యార్థులకు 16 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్‌కు 12, 10వ తరగతికి 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
News March 1, 2026
ఆన్లైన్లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా: నెల్లూరు డీఈవో

జిల్లాలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను http://deonellore.50webs.com/ ఆన్లైన్లో పొందుపరిచామని డీఈవో డా. బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాల సీనియార్టీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలతో రేపటి నుంచి 7వ తేదీ లోగా పని దినాలలో సమయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్స్‌లో అందజేయాలన్నారు.
News March 1, 2026
ఆసుత్రికి చేరుకున్న నెల్లూరు ఎస్పీ

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ప్రసూతి విభాగంలో ఆదివారం రాత్రి ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం ఏర్పడటంతో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వెంటనే స్పందించారు. ఆమె నెల్లూరు ప్రసూతి విభాగానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.


