News February 14, 2025

నెల్లూరు: పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచనలు

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కందుకూరు పర్యటనలో భాగంగా బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1060 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన ప్రదేశాల్లో బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News March 12, 2025

CBI అంటూ రూ.1.02 కోట్ల లూటీ 

image

CBI అధికారులమంటూ నెల్లూరుకు చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి నుంచి రూ.1.02కోట్లు దోచేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడికి గత నెల 25న ట్రాయ్ అధికారులంటూ కొందరు ఫోన్ చేశారు. మీ సిమ్‌పై 85 ఫిర్యాదులు ఉన్నాయని, పలు నేరాలకు సిమ్‌ను వినియోగించారంటూ బెదిరించారు. మరో వ్యక్తి సీబీఐ అధికారినంటూ అతని ఖాతా నుంచి రూ.1,02,47,680ను వివిధ ఖాతాల్లో జమ చేయించారు. దీంతో బాధితుడు వేదాయపాలెం PSలో ఫిర్యాదు చేశాడు.

News March 12, 2025

జిల్లాలో 75344 మంది లబ్ధిదారులకు ప్రయోజనం: క‌లెక్ట‌ర్‌

image

జిల్లాలో 75344 మంది లబ్ధిదారులకు రూ.1199.85 కోట్లు నిధులు మంజూరు చేశామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆనంద్ తెలిపారు. 2019-24 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేర‌కు క‌లెక్ట‌ర్ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌ట‌క‌న‌లో తెలిపారు.

News March 11, 2025

గృహ నిర్మాణాలకు అదనంగా నగదు అందజేత

image

2019-24 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఆనంద్‌ తెలిపారు. ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అందజేస్తామన్నారు.

error: Content is protected !!