News August 18, 2024

నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోండి: కమిషనర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూర్య తేజ ఆకాంక్షించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అర్జీల రూపంలో కమిషనర్‌కు చెప్పొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News January 7, 2026

నెల్లూరు: 15 మండలాలకు స్వచ్ఛ రథాలు.!

image

ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాల సంకల్పంతో స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తేనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలోని 15 మండలాల్లో గతంలో ఇంటింటికీ వచ్చి బియ్యం ఇచ్చే వాహనాల మాదిరిగా రథాలను సిద్ధం చేస్తున్నారు. ఈ రథాల్లో చెత్త సేకరణ గది, సరుకులతో కూడిన ప్రత్యేక ర్యాక్ ఉంటుంది. పొడి వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇనుప వస్తువులు అందిస్తే సరుకులు పొందవచ్చు. సరుకులు వద్దనుకుంటే నగదు చెల్లిస్తారు.

News January 7, 2026

నెల్లూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

image

వేరుశనగ, నిమ్మ పంటలకు అనుగుణంగా MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు జడ్పీలో మంగళవారం సమావేశం జరిగింది. ఎలాంటి గ్యారంటీలు లేకుండా MSMEలకు రుణాలు ఇవ్వడం లేదని చర్చ జరిగింది. MSME రుణాల మంజూరుకు మార్జిన్ మనీ ఇస్తామని.. రుణాలు త్వరగా ఇవ్వాలని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు కోరారు.

News January 7, 2026

మిల్లర్లు సహకరించాలి: నెల్లూరు జేసీ

image

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా మిల్లర్లు సహకరించాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలోని మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీకి సంబంధించి ధాన్యం సేకరణ, బ్యాంకు గ్యారంటీలపై చర్చించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.