News February 3, 2025
నెల్లూరు: ‘ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి’
5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మొదటి విడత ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని నెల్లూరు ఆర్ఐవో డా. శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో సంబంధిత ఎగ్జామినర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు, ప్రాక్టికల్ సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
Similar News
News February 4, 2025
డిప్యూటీ మేయర్‌ను అభినందించిన మంత్రులు
నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన తహసీన్‌ను నారాయణ మెడికల్ కళాశాల క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలిసి అభినందించారు, ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగర కార్పొరేషన్‌లో తొలిసారి ముస్లిం మైనారిటీ మహిళను ఎన్నుకోవడం చారిత్రాత్మకమన్నారు. ఆ నిర్ణయం తీసుకున్న మంత్రి పొంగూరు నారాయణను అభినందించారు
News February 3, 2025
కందుకూరులో యాక్సిడెంట్.. ఒకరి పరిస్థితి విషమం
కందుకూరు మండలం మాల్యాద్రి కాలనీ వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై సింగరాయకొండ వైపు నుంచి కందుకూరు వస్తుండగా మాల్యాద్రి కాలనీ వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని స్థానికలు కందుకూరు వైద్యశాలకు తరలించారు.
News February 3, 2025
నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 95 ఫిర్యాదులు
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 95 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.