News December 12, 2024

నెల్లూరు: ‘ప్రైవేటు భాగస్వామ్య వివరాలను తెలపండి’

image

భారత అంతరిక్ష రంగంలో గత ఐదేళ్లలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియజేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం ఈ మేరకు లోక్‌సభలో ఆయన పలు అంశాలపై వివరాలను ఆయన ఆరా తీశారు. ఇస్రోతో భాగస్వామ్యం కలిగి ఉన్న ప్రైవేటు కంపెనీల జాబితాను తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Similar News

News January 2, 2026

నెల్లూరోళ్లు రూ. 143.75 కోట్ల మద్యం తాగేశారు..

image

నెల్లూరు జిల్లాలో గతేడాది మద్యం ఏరులై పారింది. 2024 డిసెంబర్ నాటికి రూ.139.5 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. 2025 ఆ లెక్కను దాటేసింది. నెల్లూరోళ్లు గడిచిన డిసెంబర్ నాటికి రూ. 143.75 కోట్ల మద్యాన్ని తాగేశారు. 2024 తో పోలిస్తే.. రూ. 4 కోట్ల మేరా అధికంగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి చూస్తేనే.. జిల్లాలో మద్యం విక్రయాలు ఎంత జోరుగా సాగుతున్నాయో తెలుస్తోంది.

News January 2, 2026

వెంకటాచలంలో దారుణం.. కొడుకుని హత్య చేసిన తండ్రి

image

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం, కంటేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి రమణయ్య తన కొడుకు రఘురామయ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేసేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 2, 2026

నెల్లూరు జిల్లాలో 16 పీడీ యాక్టులు

image

నెల్లూరులో 2025లో గంజాయి బ్యాచ్‌కు ఓ వ్యక్తి బలయ్యాడు. అరుణ తర్వాత మరో లేడీ డాన్ కామాక్షి వెలుగులోకి వచ్చింది. వరుస నేరాలపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. దీంతో పోలీసులు ఎక్కడిక్కడ రౌడీషీట్లు తెరిచారు. 3కంటే ఎక్కువ కేసులు ఉన్నవారిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2025లో మొత్తం 16 మందిపై పీడీయాక్ట్, 34మందిపై గంజాయి కేసులు నమోదు చేసి 102 మందిని రిమాండ్‌కు పంపారు. 510 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.