News February 5, 2026

నెల్లూరు: ప్లాట్లు కొన్నారా.. జాగ్రత్త!

image

NMC పరిధిలో 540 అక్రమ లే అవుట్లలో 5500 ప్లాట్స్‌కు 3500 LRSకు రాగా 2 వేలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. బుచ్చిలో 36 లే అవుట్లలో 30 అక్రమం కాగా, 6 మాత్రమే అనుమతి పొంది ఉన్నాయి. వీటిల్లో 800 ప్లాట్లకు నోటీసులు జారీ కాగా, 80 మాత్రమే LRS కు వచ్చాయి. గూడూరులో 70 వరకు అక్రమ లే అవుట్లు ఉండగా.. కావలిలో అక్రమ లే అవుట్లకు LRS లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వీటిని కొనుగోలు చేసిన వారు లబోదిబోమంటున్నారు.

Similar News

News February 6, 2026

నెల్లూరు జిల్లాలో రైతులకు లోన్లు రావడం లేదు..!

image

నెల్లూరు జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ప్రస్తుత ప్రభుత్వంలో మళ్లీ వాటిని చుక్కల భూములుగా చూపారని పలువురు రైతులు వాపోతున్నారు. పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులను అధికారులు 1బి అడంగల్ తీసుకు రావాలని కోరుతున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో చుక్కల భూములకు 1బి అడంగల్ ఇవ్వడం లేదు. దీంతో రైతులకు రుణాలు అందక అవస్థలు పడుతున్నారు.

News February 6, 2026

నెల్లూరు జిల్లాలో టీచర్‌ను కాపాడిన స్టూడెంట్

image

ఉదయగిరి మండలం గండిపాలెం జడ్పీ స్కూల్లో తెలుగు టీచర్ కేసీ మాలకొండయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 10వ తరగతి విద్యార్థి కంచర్ల వెంకట కిరణ్ సిద్ధార్థ్ వెంటనే గమనించి టీచర్‌కు CPR చేయడంతో ప్రాణాలు నిలిచాయి. తర్వాత ఆయనను నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సకాలంలో స్పందించి టీచర్ ప్రాణాలు నిలిపిన విద్యార్థికి పలువురు అభినందనలు తెలిపారు.

News February 6, 2026

నెల్లూరులో ఆ రైతు ఐడియా అదుర్స్..!

image

నెల్లూరు జిల్లాలో వరి కోతకు వస్తోంది. చాలా చోట్ల వడ్ల గింజలను పిట్టలను తినేస్తున్నాయి. రైతులకు నష్టం జరుగుతోంది. ఈక్రమంలో సంగం మండలం అనసూయ నగర్‌కు చెందిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించారు. ఛార్జింగ్‌తో పనిచేసే మైక్ సెట్ పొలాల్లో ఏర్పాటు చేశారు. అందులో నుంచి శబ్దాలు రావడంతో పక్షులు అటు వైపు రావడం లేదు. ఓసారి ఛార్జింగ్ పెట్టి పొలాల్లో పెడితే సాయంత్రం వరకు పనిచేస్తోంది.