News August 20, 2024
నెల్లూరు: ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్

దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ ఉపాది హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నల్లబోతుల భాస్కర్ ను అధికారులు సస్పెండ్ చేశారు. నందిపాడు ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఏపివోఈసీ, టెక్నికల్ అసిస్టెంట్ లకు మెమోలు ఇస్తూ… ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News February 12, 2026
NLR: దొంగతనం నింద వేశారని విద్యార్థి సూసైడ్

నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. టీపీగూడూరు(M) మండలం పేడూరు గమ్మళ్లపాలేనికి చెందిన యువకుడు(16) ఓ ప్రైవేట్ స్కూళ్లో 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఉరేసుకున్నాడు. అతను చదివే స్కూల్లో నగదు దొంగతనం జరిగిందని.. విద్యార్థే చోరీ చేశాడని టీచర్లు నిలదీశారంట. నింద భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు.
News February 12, 2026
నెల్లూరులో జనసేనను నడిపించేది ఎవరు..?

నెల్లూరులో జనసేనను నడిపించే నాయకుడు కనబడటం లేదు. గతంలో మనుక్రాంత్ రెడ్డి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత ఆయన YCPలో చేరారు. అప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడిని నియమించలేదు. అజయ్ కుమార్ పార్టీని నడిపినా.. ఆయనపై అసమ్మతితో తప్పించి విచారణ కమిటీ వేసినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధ్యక్షుడు లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఉనికి దెబ్బతింటుందని కార్యకర్తలు వాపోతున్నారు.
News February 12, 2026
చిత్త శుద్ధితో విధులను నిర్వహించండి: కలెక్టర్

అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో ఎస్‌ఎస్‌సీ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల దీర్ఘకాల గైర్హాజరు వారికి రెసిడెన్షియల్ శిబిరాలు, పాఠశాలల్లో సివిల్ పనుల స్థితి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షర ఆంధ్ర, వన్ మంత్ ఫోర్ విజిట్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.


