News August 28, 2024

నెల్లూరు : ఫోర్జరీ కేసులో కొనసాగుతున్న విచారణ

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకాల ఫోర్జరీ కేసులో పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే ఈ కేసులో నగరపాలక సంస్థ టీపీఓ దేవేంద్రను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నగర డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్, నుడా కార్యాలయాల్లో విచారణ చేపట్టారు. పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Similar News

News February 28, 2026

నెల్లూరు జిల్లాకు రూ.126.91 కోట్ల కేటాయింపు

image

నెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి అధికారులు, సిబ్బంది ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నారు. మార్చి నెలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2,89,647 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ప్రభుత్వం రూ.126.91 కోట్లను కేటాయించిందని DRDA పీడీ నాగరాజకుమారి తెలిపారు.

News February 28, 2026

నెల్లూరు జిల్లాలో ప్రిన్సిపల్ సూసైడ్

image

చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బి.సునీల్(38) పొదలకూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి కాల్ చేస్తుంటే ఆయన లిఫ్ట్ చేయలేదు. బంధువులు ఫోన్ లొకేషన్ ఆధారంగా వెతకగా.. మడమనూరు సమీపంలో విషం తాగి పడిపోయినట్లు గుర్తించారు. చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించగా శుక్రవారం చనిపోయారు. అప్పులు, వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.

News February 28, 2026

శ్రీసిటీలో భారీ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు

image

శ్రీసిటీకి మరో భారీ పరిశ్రమ రానుంది. జపాన్‌కు చెందిన ప్రొటీరియల్ లిమిటెడ్ సంస్థ రూ.700కోట్లతో ఎలక్ట్రికల్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే తొలిసారి బొగ్గుతో కాకుండా మొత్తం విద్యుత్తు ద్వారా ఎల్లాయ్ రిబ్బన్‌ను ఉత్పత్తి చేయనుంది. రెండో దశలో మరో రూ.700కోట్లు పెట్టనుంది. ముందుగా 200 మందికి.. తర్వాత 500మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ ఏడాది చివరిలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.