News January 29, 2026
నెల్లూరు: ఫ్రీ ల్యాప్‌టాప్.. వైరల్

ఫ్రీ ల్యాప్‌టాప్ పథకం అంటూ నెల్లూరు జిల్లాలోని వాట్సాప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇండియా ఫ్రీ ల్యాప్‌టాప్-2026 పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని.. వివరాలు నమోదు చేసుకుంటే ఫ్రీగా ఇస్తారని ఓ లింకును షేర్ చేస్తున్నారు. ఇలాంటి పథకంపై అధికారులు ఎక్కడా ప్రకటన చేయలేదు. ఇలాంటి మెసేజ్‌లపై జాగ్రత్తగా ఉండండి.
Similar News
News February 5, 2026
నెల్లూరు: ఆన్‌లైన్‌లో మహిళ పరిచయం.. రూ.30 లక్షలు స్వాహా!

నెల్లూరు వెంకటరెడ్డి నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్, టెలిగ్రామ్‌లో శివాని అనే మహిళ పరిచయం ఏర్పడింది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో ఆ ఉద్యోగి మహిళ సూచించిన బ్యాంక్ ఖాతాలకు రూ.29.8 లక్షలు నగదు జమచేశాడు. తన అవసరం నిమిత్తం పెట్టుబడులు ఉపసంహారించుకునేందుకు ప్రయత్నించగా నగదు రాలేదు. దీంతో బాధితుడు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News February 5, 2026
నెల్లూరు: ‘రాకాసి’పుండు కబలిస్తోంది..!

నెల్లూరు జిల్లాలో క్యాన్సర్(రాకాసి పుండు) మహమ్మారి ప్రజల జీవితాలను కాలరాస్తోంది. IRCS క్యాన్సర్ ఆసుపత్రికి రేడియేషన్ థెరఫీకి 2023లో 291, 2024లో 3697, 2025లో 2441 మంది వచ్చారు. జిల్లాలోని PHCల ద్వారా OCT-2025 నుంచి GGHకు 364 కేసులు రెఫరల్‌గా రాగా.. 32 మందిలో వ్యాధి నిర్ధారణ అయినట్లు NCD అధికారులు తెలిపారు. మారిన ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలు, కాలుష్యం వంటివి క్యాన్సర్ వచ్చేందుకు కారణాలుగా ఉన్నాయి.
News February 5, 2026
సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి: కలెక్టర్

జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిరోజూ నిర్వహించాలని, ఈ అంశంపై ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.


