News September 7, 2024

నెల్లూరు: బాధితుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు

image

విజయవాడ వరద బాధితులకు ఆహారం, తాగునీటిని అందించాలనుకునే వారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0861 2331261, 79955 76699 కాల్ సెంటర్ ద్వారా సమాచారం పొం దాలని అధికారులు సూచించారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు CMRF పేరిట డీడీ తీసి, కలెక్టర్ కు అందజేయాలని, వీటిని సీఎం కార్యాలయానికి పంపుతామని చెప్పారు.

Similar News

News September 29, 2024

నెల్లూరు జిల్లాలో ASIలుగా పోస్టింగ్ పొందింది వీరే..

image

➥భాస్కర్ రెడ్డి-ఏఎస్ పేట
➥రియాజ్ అహ్మద్-చిన్నబజార్
➥వరప్రసాద్, ఉమామహేశ్వరరావు-సౌత్ ట్రాఫిక్
➥శ్రీహరిబాబు, శ్రీధర్రావు, లక్ష్మీ నరసయ్య-నవాబుపేట
➥షేక్.జిలాని-మనుబోలు
➥మాల్యాద్రి-కావలి2
➥మునిరావు-వేదాయపాలెం
➥రాజగోపాల్-గుడ్లూరు
➥ వెంకటేశ్వర్లు-ఇందుకూరుపేట
➥మాధవరావు-వేదయపాలెం
➥కరీముల్లా-విడవలూరు
➥సురేంద్రబాబు-Nరూరల్
➥మునికృష్ణ-వెంకటాచలం
➥V.శ్రీనివాసులు-కోవూరు

News September 29, 2024

నెల్లూరు: వదినను చంపిన వ్యక్తి అరెస్ట్

image

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నూరులో వదినను హత్య చేసిన కేసులో ముద్దాయి పాలెపు రమేశ్‌ను శనివారం అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై పి మనోజ్ కుమార్ తెలిపారు. తిప్పవరప్పాడు జంక్షన్ వద్ద గూడూరు రూరల్ CI , SI, సిబ్బందితో కలిసి అరెస్టు చేశామని అన్నారు.

News September 29, 2024

ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు: కలెక్టర్

image

ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ గోడౌన్ల లోని ఈవీఎంలు, వివి ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.