News February 17, 2025
నెల్లూరు: బాలుడిపై లైంగిక దాడి

బాలుడి(10)పై మరో బాలుడు(17) లైంగికదాడి చేసిన ఘటన ఆదివారం వెలుగులోకొచ్చింది. దుత్తలూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూడో తరగతి చదువుతున్న బాలుడిపై అదే గ్రామానికి చెందిన మరో బాలుడు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలుడిని ఎస్ఐ ఆదిలక్ష్మి ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. కావలి డిఎస్పీ శ్రీధర్, సీఐ వెంకట్రావు విచారణ జరిపారు. లైంగిక దాడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 12, 2025
డా.N. యువరాజ్‌కు నెల్లూరు జిల్లా బాధ్యతలు

నెల్లూరు జిల్లా ప్రత్యేకాధికారిగా డా.N.యువరాజ్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్‌కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.
News March 12, 2025
CBI అంటూ రూ.1.02 కోట్ల లూటీ

CBI అధికారులమంటూ నెల్లూరుకు చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి నుంచి రూ.1.02కోట్లు దోచేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడికి గత నెల 25న ట్రాయ్ అధికారులంటూ కొందరు ఫోన్ చేశారు. మీ సిమ్‌పై 85 ఫిర్యాదులు ఉన్నాయని, పలు నేరాలకు సిమ్‌ను వినియోగించారంటూ బెదిరించారు. మరో వ్యక్తి సీబీఐ అధికారినంటూ అతని ఖాతా నుంచి రూ.1,02,47,680ను వివిధ ఖాతాల్లో జమ చేయించారు. దీంతో బాధితుడు వేదాయపాలెం PSలో ఫిర్యాదు చేశాడు.
News March 12, 2025
జిల్లాలో 75344 మంది లబ్ధిదారులకు ప్రయోజనం: కలెక్టర్

జిల్లాలో 75344 మంది లబ్ధిదారులకు రూ.1199.85 కోట్లు నిధులు మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. 2019-24 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఒక ప్రటకనలో తెలిపారు.