News February 24, 2026
నెల్లూరు: బైక్ చోరీ.. పదేళ్ల తర్వాత శిక్ష

పదేళ్ల క్రితం జరిగిన బైక్ చోరీ కేసులో నిందితుడికి కోర్టు ఏడాది సాధారణ జైలుశిక్ష విధించింది. 2015లో నెల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో లక్ష్మయ్య అనే వ్యక్తి మోటారు సైకిల్ చోరీకి గురవ్వగా, నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో యలమవారిదిన్నెకు చెందిన పవన్‌కల్యాణ్‌ను అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.
Similar News
News February 26, 2026
అంకురార్పణతో మొదలైన రంగడి బ్రహ్మోత్సవాలు

నెల్లూరులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీతల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంకురార్పణతో మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు 26 నుంచి 8 వరకు జరగనున్నాయి. ఆలయ అర్చకులు అంకురార్పణలో భాగంగా పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, మృత్ సంగ్రహణ, ఉత్సవమూర్తులకు రక్షాబంధన్, సోమ కుంభ ప్రతిష్ఠ, గరుడ ధ్వజ ప్రతిష్ఠ, అంకురార్పణ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
News February 26, 2026
అనంతసాగరం MROపై సస్పెన్షన్ వేటు

అనంతసాగరం MRO జయవర్ధన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని పట్ల ఆయన అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వేధిస్తున్నాడంటూ జిల్లా అధికారులకు బాధిత ఉద్యోగిని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు విచారణ చేసిన అధికారులు నిజం అని తేలడంతో MROపై వేటు వేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలు జారీ చేశారు.
News February 26, 2026
నెల్లూరులో కొత్త మోసం.. జాగ్రత్త!

ఆన్‌లైన్ దోపిడీకి సైబర్ నేరగాళ్లు మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. RTO ఆఫీస్ చలానా పేరుతో వాట్సాప్‌కు APK ఫైల్స్ పంపిస్తున్నారు. నెల్లూరులో కొందరు వీటిని క్లిక్ చేశారు. వారి నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఏపీకే ఫైల్ ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ అవుతోంది. ఇలాంటి వాటిని క్లిక్ చేస్తే నగదు దోచేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


