News November 4, 2024

నెల్లూరు: భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య

image

భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులోని వేమారెడ్డి నగర్‌లో చోటుచేసుకుంది. రాగాల యాచేంద్ర, తేజస్విని(20)కి రెండేళ్ల క్రితం వివాహం అయింది. సంతానం లేకపోవడంతో యాచేంద్ర ఆమెను నిత్యం వేధింపులకు గురి చేశాడు. దీంతో వేధింపులకు తట్టుకోలేక ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News July 5, 2025

ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు

image

ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News July 5, 2025

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

వరికుంటపాడు హైవేపై శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో దుత్తలూరు (M) కొత్తపేటకు చెందిన బర్రె రవి, తాళ్లూరి కృపానందం గాయపడ్డారు. తాళ్లూరి కృపానందం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ అదుపు తప్పిందా లేక గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా అనే విషయంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

News July 5, 2025

బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగ సందడి

image

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ సందడి ముందుగానే ప్రారంభమైంది. శుక్రవారం స్వర్ణాల చెరువు వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. జులై 6 నుంచి 10 తేదీ వరకు ఐదు రోజులపాటు రొట్టెల పండుగ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకున్నారు.