News March 22, 2025
నెల్లూరు: మంత్రి ఫరూక్ సతీమణి మృతి పట్ల ఆనం తీవ్ర విచారం

ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎన్ఎండీ ఫరూక్, సతీమణి షహనాజ్, మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Similar News
News March 1, 2026
నెల్లూరు గృహ నిర్మాణ శాఖ ఈఈ బదిలీ

గృహ నిర్మాణ శాఖ సంస్థ నెల్లూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎంవీ మోహన్ రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి శనివారం ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఆయనను కొత్తగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. కాగా మోహన్ రావు స్థానంలో ఇక్కడ ఎవరినీ నియమించలేదు.
News March 1, 2026
నెల్లూరు జిల్లా YCPలో ఆయన ఫేవరెట్టా.?

ఎన్నికల్లో ఓటమితో జిల్లాలో డీలాపడ్డ YCPకి MLC చంద్రశేఖర్ రెడ్డి అండగా ఉన్నారు. అనిల్, కాకాణి వంటి నేతలు పార్టీకి కొంత కాలం దూరంగా ఉండటం, ఆ సమయంలో కూటమికి దీటుగా సమాధానం ఇవ్వడం, కార్యకర్తలు, నేతలకు భరోసా ఇవ్వడంతో చంద్రశేఖర్ రెడ్డి జగన్ దృష్టిని ఆకర్షించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు అర్బన్ నుంచి ఆయన్ను బరిలో దింపనున్నట్లు చర్చ జరుగుతోంది. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండటం ఆయనకు కలిసొస్తుందంటున్నారు.
News February 28, 2026
వైద్యాధికారులకు నోటీసులు పంపుతాం: DMHO

స్కానింగ్ రెన్యువల్ చేయని సీహెచ్సీలు స్కానింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేసేందుకు తీర్మానించినట్లు జిల్లా వైద్యాధికారి సుజాత తెలిపారు. జిల్లాస్థాయి సలహా సంఘంతో పిండ, లింగ నిర్ధారణపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్కానింగ్ రెన్యువల్‌లో నిర్లక్ష్యంగా ఉన్న వెంకటాచలం, ఉదయగిరి సీహెచ్సీలకు, మార్పు చేయుటలో నిర్లక్ష్యంగా ఉన్న పొదలకూరు, కావలి ఫోకస్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు నోటీసులు జారీ చేస్తామన్నారు.


