News April 11, 2024

నెల్లూరు: మద్యం దుకాణాలపై ఆంక్షలు..?

image

ఆంక్షలతో నెల్లూరు జిల్లాలో కొన్నిచోట్ల సాయంత్రానికే మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 271 షాపులు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌లో ఒకరోజులో ఎంత మొత్తం మద్యం విక్రయించారో.. ప్రస్తుతం కూడా రోజుకు అంతే విక్రయించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న షాపుల్లో సాయంత్రానికే టార్గెట్ పూర్తి కావడంతో మూతపడుతున్నాయి. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

Similar News

News February 20, 2026

నెల్లూరు: సోలార్ కరెంట్‌లో సమస్య ఉందా?

image

నెల్లూరు సహా APSPDCL పరిధిలోని సోలార్ విద్యుత్ వినియోగదారులు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారం కోసం ఆ సంస్థ CMD శివశంకర్ లోతేటి కీలక ప్రకటన చేశారు. సోలార్ ప్యానెల్స్, కనెక్షన్ తదితర సమస్యలు ఉంటే 1912 టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. IVRS కాల్ చేసిన తర్వాత ‘5’ అంకెను నొక్కడంతో నేరుగా సోలార్ ఫిర్యాదు నమోదు అవుతుందన్నారు.

News February 20, 2026

నెల్లూరులో 20వేల మంది ఎదురుచూపులు..!

image

నెల్లూరు జిల్లాలో 29లక్షల మంది జనాభాలో 30,5640 మంది పెన్షనర్లు. వీరికి నెలకు రూ.127 కోట్లు పంపిణీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. కనీసం ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారనే లెక్కలూ సేకరించలేదు. వితంతు పెన్షన్లూ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సదరం సర్టిఫికెట్స్ ఉన్నవారితో పాటు అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం జిల్లాలో 20వేల మంది ఎదురు చూస్తున్నారు.

News February 20, 2026

నెల్లూరు: 5రోజుల్లోనే రైతులకు డబ్బుల జమ

image

నెల్లూరు జిల్లాలో శనగ పంటను క్వింటాల్‌కు ₹5,875 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2వ తేదీ లోపు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. తేమ శాతం 14% లోపు ఉన్న పంటను మాత్రమే సేకరిస్తామని, విక్రయించిన 5 రోజుల్లోనే నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8978381839 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.