News January 12, 2026
నెల్లూరు: మన నిమ్మకు.. ఉత్తరాదిన ధీమా.!

నెల్లూరు జిల్లా నుంచి దేశంలో పలు ప్రాంతాలకు అత్యధికంగా నిమ్మ పంట ఎగుమతి అవుతుంది. ఢిల్లీ, బిహార్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, UPలకు సీజన్‌లో ఎక్కువగా, అన్ సీజన్ TN, కర్ణాటక, కేరళకు వెళ్తున్నాయి. 23-24లో 50628 క్వింటాళ్లు (రూ.14.99 cr), 24-25లో 36579 క్వింటాళ్లు (రూ.14.73cr), 25-26లో 21631 క్వింటాళ్లు (రూ.6.16cr) విక్రయాలు జరిగాయి. ప్రస్తుత కలెక్టర్ చొరవతో నిమ్మ KG రూ.22 ఉందని రైతులన్నారు.
Similar News
News February 14, 2026
నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి: మాజీ మంత్రి అనిల్

‘నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించవచ్చు’ అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తనకు ఎక్కడా వ్యాపారాలు, కోట్లు విలువ చేసే బంగ్లాలు కూడా లేవని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయని అన్నారు. కావాలంటే తనపై ఎంక్వయిరీ వేయించండి అని, కోట్లు ఉన్నట్లు తెలితే ఆ డబ్బులు అమరావతికి విరాళం కింద ఇస్తానని తెలిపారు.
News February 14, 2026
NLR: ఇద్దరూ కలెక్టర్లే.. కానీ మంచి పేరెంట్స్ కూడా.!

ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు కలెక్టర్ <<19137448>>దంపతులు<<>> హిమాన్షు శుక్లా, కృతిక(పల్నాడు). వీరు ఒకే వృత్తిలో ఉంటూ ఉద్యోగానికి.. ఫ్యామిలీకి సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. వృత్తి రీత్యా ఇద్దరూ తీరిక లేకుండా ఉన్నప్పటికీ వారానికో రోజు తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు హిమాన్షు Way2Newsకు వివరించారు. ఓ వారం తాను.. మరో వారం తన భార్య నెల్లూరు to పల్నాడుకు జర్నీ చేస్తూ సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
News February 14, 2026
లవర్స్‌కు నెల్లూరు కలెక్టర్ సలహా ఇదే

నేటి యువత భవిష్యత్తులో స్థిరపడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే తమకు ఇష్టమైన జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. <<19130524>>ప్రేమికుల రోజు<<>>ను పురస్కరించుకొని Way2Newsతో ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. యువత మొదట చదువు పూర్తి చేసి, మంచి ఉద్యోగం, ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని వివరించారు. #Valentine’s Day


