News December 20, 2025

నెల్లూరు: మాతృవేదన.. తీరేనా.!

image

నెల్లూరు జిల్లాలో హైరిస్క్‌ గర్భిణుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 44,536 మంది గర్భిణుల్లో రక్తహీనత, బీపీ వంటి సమస్యలతో 6,235 మందిని ‘హైరిస్క్‌’గా గుర్తించారు. వీరిపై నిరంతర పర్యవేక్షణ కొరవడటంతో మరణాలు ఆగడంలేదు. నాలుగేళ్లలో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు మృతి చెందారు. జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు 19గా నమోదైంది. వైద్యశాఖ దృష్టిసారిస్తేనే ఈ ముప్పును నివారించగలరు.

Similar News

News December 23, 2025

నెల్లూరులో భారీగా పెరిగిన గుడ్డు ధర

image

నెల్లూరు జిల్లాలో ఓ ట్రే గుడ్లు(30) ధర కేజీ మాంసంతో పోటీపడుతోంది. మార్కెట్లో ఆల్ టైం రికార్డ్ సృష్టిస్తోంది. పౌల్ట్రీ చరిత్రలోనే ఇదే అత్యధికమని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో రూ.5, రూ.6వరకు పలికిన గుడ్డు ధర ప్రస్తుతం రూ.8.5కు చేరింది. గతంలో 30 కోడిగుడ్లు రూ.160 నుంచి రూ.170 వరకు విక్రయించేవారు. 10రోజులుగా 30 గుడ్లను రూ.240 వరకు హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే విక్రయిస్తున్నారు.

News December 23, 2025

వింజమూరు MPP తొలగింపు

image

వింజమూరు మండల అధ్యక్షుడు ఇనగనూరి మోహన్ రెడ్డిని తొలగిస్తూ ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 31వ తేదీన వింజమూరు మండల కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలో మండలంలోని 12 మంది ఎంపీటీసీలకు గాను 11 మంది సభ్యులు ఎంపీపీపై అవిశ్వాసానికి ఓటు వేశారు. ఈ మేరకు ఎంపీపీని తొలగిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.

News December 23, 2025

TPT: అన్యమతస్థులతో గోవిందరాజస్వామి ఆలయ పనులు..?

image

గోవిందరాజస్వామి ఆలయం విమాన గోపురం బంగారు తాపడం పనులు కాంట్రాక్టర్ జ్యోత్ టెండర్ ద్వారా దక్కించుకుని మరో ఇద్దరు అన్యమతస్థులకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అయితే వారికి ఎలాంటి రాతపూర్వకంగా ఇవ్వలేదని విజిలెన్స్ అధికారులు తేల్చారు. కాగా పనుల్లో అవకతవకలు, విగ్రహాలు తొలగించడంపై హిందూ సంఘాలు ఆరోపణల చేశాయి. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.