News September 22, 2025
నెల్లూరు: మా ధాన్యం కొనేదెవరు మహాప్రభో…!

పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక, గిట్టుబాటు ధర అందక రైతులు లబో.. దిబోమంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో ఈ దుస్థితి నెలకొంది. ప్రభుత్వం కొనుగోలు ధరను ప్రకటించినా ఆ ధరకు ఎవరూ కొనడంలేదని వాపోతున్నారు. ధాన్యాన్ని దాచుకోవడానికి గోడౌన్లు లేవని ఆవేదన చెందుతున్నారు. అసలే వర్షాలు పడుతున్నాయని, ఇదే అదునుగా దళారులు అతి తక్కువ ధరకు అడుగుతున్నారని, తమకు గిట్టుబాటు ధర ఇప్పించాలని కోరుతున్నారు.
Similar News
News September 22, 2025
నెల్లూరు: మద్దతు ధర లేక రైతుల కష్టాలు!

జిల్లాలోని వరి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మిల్లర్లు, దళారులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా, పుట్టి రూ.15 వేలకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు రూ.16,520 నష్టం వాటిల్లుతోంది. వర్షాల కారణంగా ధాన్యం రంగు మారిందని సాకుతో రేట్లు తగ్గిస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దోపిడీకి గురవుతున్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా జోక్యం చేసుకోవాలంటున్నారు.
News September 22, 2025
నెల్లూరు: రెగ్యులర్ అధికారులు లేక ఇన్‌ఛార్జులతోనే పాలన!

జిల్లాలో కీలక శాఖల్లో రెగ్యులర్ అధికారులు లేక ఇన్‌ఛార్జ్‌లతోనే పాలన సాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాల అమలు మందగిస్తోంది. రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, మునిసిపల్, విజిలెన్స్ వంటి విభాగాల్లో ఫైళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. నుడా వీసీ, DRO, మునిసిపల్ కమిషనర్, మైనింగ్ డీడీ, స్పెషల్ కలెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండగా, పలు బాధ్యతలు తాత్కాలిక అధికారులకే అప్పగించారు. ఫలితంగా నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి.
News September 22, 2025
APK ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దు: నెల్లూరు SP

వాట్సాప్ గ్రూపులో వచ్చే APK ఫైల్స్ పట్ల జాగ్రత్త వహిస్తూ డౌన్లోడ్ చేయొద్దని SP డా. అజిత వెజెండ్ల తెలిపారు. అనధికారిక యాప్స్ ఎప్పటికైనా ప్రమాదకరమని వాటి జోలికి వెళ్లొద్దని సూచించారు. ఆఫర్స్ కోసం APK ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయవద్దన్నారు. APK ఫైల్స్ ఫార్వర్డ్ చేయడం వల్ల మొబైల్, కంప్యూటర్‌లో వైరస్ చేరే అవకాశం ఉంటుందన్నారు.