News January 17, 2026

నెల్లూరు: మీ పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం

image

నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతు, సుడిగుండాలు తెలియకుండా నీటిలోకి దిగితే ప్రాణాపాయం తప్పదని సూచించారు. బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలని, పిల్లలను నీటి దగ్గర ఒంటరిగా వదలరాదని తెలిపారు. ఒక్క నిమిషం అజాగ్రత్త కుటుంబానికి జీవితకాల దుఃఖాన్ని మిగుల్చుతుందని హెచ్చరిస్తున్నారు.

Similar News

News February 11, 2026

నెల్లూరు: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

image

నెల్లూరు జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు మీ వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని అధికారులు తెలిపారు.

News February 11, 2026

నెల్లూరు: చదవడం ఇష్టం లేక పరార్..!

image

నెల్లూరులో ఇద్దరు విద్యార్థులు పారిపోవడం కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. నాలుగో మైలు ఏరియాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఇద్దరు 8వ తరగతి చదువుతున్నారు. అదే స్కూల్‌కు చెందిన హాస్టల్లో వాళ్లు ఉంటున్నారు. అక్కడ చదవడం వాళ్లకు ఇష్టం లేదు. సోమవారం స్కూల్లో ఓ ఫంక్షన్ చేశారు. ఆ సమయంలో గేట్లు తెరిచి ఉంచడంతో ఆ ఇద్దరూ పారిపోయారు. మంగళవారం రాత్రి వాళ్ల ఇళ్లకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News February 11, 2026

నెల్లూరు: వ్యవసాయ పరికరాలు ఈసారైనా..?

image

జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనది. అయినా రెండేళ్ల నుంచి రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన కింద యంత్ర పరికరాలు మంజూరు కాలేదు. ఫలితంగా దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువైన వరికొత మిషన్లు, డ్రోన్లు వంటి 1,452 రకాల పరికరాలు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు డ్రోన్లకు ఇప్పటికే దరఖాస్తులు వచ్చినా నిధులు లేమి వేధిస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు కేటాయిస్తారో..లేదో చూడాల్సి ఉంది.