News August 14, 2024
నెల్లూరు: మూడు రోజుల్లో నిశ్చితార్థం.. యువకుడి స్పాట్ డెడ్

తల్లికి మందులు తీసుకునేందుకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన ఆత్మకూరులో జరిగింది. మర్రిపాడు మండలం కదిరినేనిపల్లికి చెందిన సాలెహా(28) జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లి వారం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. మూడు రోజుల్లో నిశ్చితార్థం.. ఇంతలో తన తల్లికి ఆరోగ్యం బాగొలేకపోపవడంతో మందులను తీసుకునేందుకు ఆత్మకూరుకు బైక్‌పై వెళ్లాడు. తిరిగి గ్రామానికి వెళ్తుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News February 18, 2026
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. నూతన రిజిస్ట్రార్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
News February 18, 2026
నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.