News March 4, 2025
నెల్లూరు: రిజర్వాయర్‌లో మహిళ డెడ్ బాడీ

వెంకటాచలం మండలం జోసఫ్ పేట వద్ద సర్వేపల్లి రిజర్వాయర్‌లో బాగా ఉబ్బిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. పది రోజుల కిందట గొలగమూడి సమీపంలోని సర్వేపల్లి కాలువలో కొట్టుకు వచ్చిన సుమారు 35 ఏళ్ల మహిళా మృతదేహంగా గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పది రోజులుగా మహిళ మృతదేహం కోసం సర్వేపల్లి కాలువ, రిజర్వాయర్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News March 3, 2026
నేడు కనుపూరు ముత్యాలమ్మ మొదటి చాటింపు

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులోని ముత్యాలమ్మ జాతర మొదటి చాటింపు మంగళవారం అర్ధరాత్రి వేస్తున్నట్లు ఆలయ ఎక్స్ అఫీషియో సభ్యుడు చాకిరి రమణయ్య తెలిపారు. చంద్రగ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం ఈ చాటింపు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతర నిర్వహణకు సంబంధించి గ్రామస్థులు, భక్తులు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.
News March 3, 2026
నెల్లూరు: బాలికలకు HPV వాక్సిన్

మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించిండానికి ప్రభుత్వం ఉచితంగా HPV వాక్సిన్‌ను అందుబాటులోకి తేనుంది. నెల్లూరు జిల్లాలో 80 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 14- 15 ఏళ్ల లోపు బాలికలకు HPV వాక్సిన్ వేయనున్నారు. జిల్లా 24.69 లక్షలు మంది ఉండగా.. ఇందులో ఒక శాతం(24వేలు) మంది బాలికలు 14-15 ఏళ్ల మధ్య ఉండవచ్చని అంచనా. ఎంతో ఖరీదైనా ఈ వాక్సిన్‌ను ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి తీసుకురానున్నారు.
News March 3, 2026
ఇందుకూరుపేట: వేటకు వెళ్లి ఒకరు మృతి

ఇందుకూరుపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గంగపట్నం ఎస్సీ కాలనీకి చెందిన ఏలూరు వెంకటరమణయ్య చేపల వేట కోసం సమీపంలోని ఉప్పుటేరుకు వెళ్లారు. అక్కడ వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీశారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే వెంకటరమణయ్య ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.


