News January 18, 2025
నెల్లూరు: ‘రిపబ్లిక్ డే వేడుకలు సమర్ధవంతంగా నిర్వహించాలి’

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్, ఎస్పీ మణికంఠ, జేసీ శుభం బన్సల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 16, 2025
కొత్త ఈ-పాస్ యంత్రాలను పంపిణీ చేసిన నెల్లూరు ఆర్డీవో

నెల్లూరు నగర ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం నెల్లూరు ఆర్డీవో అనూష రేషన్ షాప్ డీలర్లకు కొత్త ఈ-పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. తొలుత ఆమె సాంకేతిక సిబ్బందితో కలిసి యంత్రాల వినియోగ విధానాన్ని పరిశీలించారు. ప్రజలకు ఎంతో పారదర్శకంగా, వేగవంతంగా సేవలందించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడతాయన్నారు. నగర ఎమ్మార్వో షఫీ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
News September 15, 2025
నెల్లూరు:13 మందికి ఎంపీడీవోలుగా పదోన్నతి

11 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు ఇద్దరు ఏవోలకు ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం జడ్పీ ఇన్ఛార్జ్ సీఈవో మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో నలుగురు డిప్యూటీ ఎంపీడీవోలకు, తిరుపతి జిల్లాలో ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలకు ప్రకాశం జిల్లాలో నలుగురు, బాపట్ల జిల్లాలో ఒకరికి పదోన్నతి కల్పించారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఏవోగా పనిచేస్తున్న ఒకరిని బాపట్ల జిల్లాలో ఒకరిని ఎంపీడీవోగా నియమించారు.
News September 15, 2025
ఉదయగిరి: ఏటీఎం మార్చి నగదు కాజేసిన కేటుగాడు

ఉదయగిరిలో ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 8వ తేదీన సినిమా హాల్ వీధికి చెందిన ఓ మహిళ తన ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్కి వచ్చింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని కోరింది. దీంతో ఆ వ్యక్తి కొంత డబ్బులు డ్రా చేసి ఆమెకు సంబంధించిన ఏటీఎం కార్డు ఇవ్వకుండా వేరే కార్డు మార్చి అందులోని రూ.8 వేలు నగదును ఆ కేటుగాడు కాజేశారు.